పవర్ స్టార్ ‘OG’ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కు పూనకాలు కన్ఫామ్!

-

Pawan Kalyan OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న అప్‌కమింగ్ భారీ ప్రాజెక్ట్ ఓజీ. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ముంబై గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ చిత్రంపై పవన్ కల్యాణ్ అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. కమ్‌బ్యాక్ తర్వాత పవన్ కల్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన మూడు చిత్రాలకు పాజిటివ్ టాక్‌ వచ్చినా.. అనుకున్న రేంజ్‌లో మాత్రం కలెక్షన్లు రాలేదు. పవర్ స్టార్ రేంజ్‌కు మార్కెట్‌లో వసూళ్లు రాలేదు. దీంతో అభిమానులంతా ఈ చిత్రంపైనే హోప్స్ పెంచుకున్నారు.

- Advertisement -

Pawan Kalyan OG | అంతేగాక, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయాలని నిర్మాత దానయ్య ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో గ్లింప్స్, పస్ట్‌లుక్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం శుభవార్త చెప్పింది. పవన్ కల్యాణ్ పుట్టినరోజున(సెప్టెంబర్ 2) చిత్రం ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సుజిత్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆగలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

Read Also: వీఐపీలకు కీలక విజ్ఞప్తి.. సామాన్య భక్తులకే నా ప్రాధాన్యత: భూమన
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...