పవన్ కల్యాణ్ పారితోషికం – టాలీవుడ్ టాక్

పవన్ కల్యాణ్ పారితోషికం - టాలీవుడ్ టాక్

0
86

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…ఆయనకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు… ఇక ఆయన సినిమాల కోసం మూడున్నర సంవత్సరాలుగా అభిమానులు ఎదురుచూస్తున్నారు…మొత్తానికి వకీల్ సాబ్ సినిమా తాజాగా వచ్చింది.. మంచి వసూళ్లు సాధించింది, ఇక కరోనా సెకండ్ వేవ్ సమయంలో కూడా ఆయన సినిమాలకు మంచి వసూళ్లు వచ్చాయి.

 

ఇక తాజాగా ఆయన రెండు చిత్రాలు సెట్స్ పై పెట్టారు.. ఈ సినిమాలపై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి… అయితే తాజాగా ఆయన రెమ్యునరేషన్ గురించి టాలీవుడ్ లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి…. గతంలో ఆయన అత్తారింటికి దారేది చిత్రానికి సుమారు 30 కోట్లు అందుకున్నారు అని వార్తలు వినిపించాయి.

 

ఇక వకీల్ సాబ్ కు సుమారు 50 కోట్ల రెమ్యునరేషన్ అందింది అని వార్తలు వినిపించాయి.. దీంతో ఆయన తదుపరి సినిమాలకు దానికి మించి రెమ్యునరేషన్ ఉంటుంది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ మా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దే అంటున్నారు అభిమానులు.