పవన్ పింక్ మూవీలో నటించడంపై ఫైనల్ డెసిషన్ చెప్పిన అలీ

పవన్ పింక్ మూవీలో నటించడంపై ఫైనల్ డెసిషన్ చెప్పిన అలీ

0
78

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే… బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ రీమేక్ ద్వారా పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు… ఆ చిత్రంలో హాస్యనటుడు అలీ కూడా నటిస్తున్నారని కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…

అంతేకాదు పవన్ కళ్యాణ్ స్వయంగా అలీకి ఫోన్ చేసిన తన చిత్రంలో నటించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి… అయితే ఈ వార్తలపై అలీ స్పందించారు… సినిమాలు రాజకీయాలు వేరని తన స్నేహితుడు సినిమాలో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు…

అయితే ఇంతవరకు తనను ఎవ్వరు సంప్రదించలేదని ఒకవేళ సంప్రదిస్తే ఖచ్చితంగా నటిస్తానని తెలిపారు… తన రాజకీయ కెరియర్ సినిమాలతో ముడిపెట్టనని తెలిపారు… తనకు పవన్ ఫోన్ చేయలేదని తెలిపారు అలీ… కాగా గతంలో పవన్ నటించిన ప్రతీ సినిమాలో అలీ నటించాడు నటించిన చిత్రాలన్ని హిట్ అయ్యాయి… తొలిప్రేమ సినిమానాటి నుంచి నేటి వరకు పవన్ అలీల జెర్నీ కొనసాగుతూనే ఉంది… ఇటీవలే వీరిద్దరు రాజకీయంగా చెరోదారి పట్టారు…