బ్రేకింగ్…. పవన్ పింక్ మూవీలో రేణుదేశాయ్ నటించే క్యారెక్టర్ అదే….

బ్రేకింగ్.... పవన్ పింక్ మూవీలో రేణుదేశాయ్ నటించే క్యారెక్టర్ అదే....

0
88

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్ ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే… వేణు శ్రీరామ్ దర్శకత్వం మహిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది…

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రిస్తున్నారు… తాజాగా ఈ చిత్రానికి సంబంధించి కొన్నివార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి… పవన్ పింక్ మూవీలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి… ఈ మూవీలో ఓ తల్లికి బిడ్డగా నటించాల్సిన పాత్రకు రేణు దేశాయ్ ని డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

రేణు దేశాయ్ ఎంపికలో పవన్ సైతం అభ్యంతరం చెప్పలేదని ఇండస్ట్రీలో గుసగుసలు… కాగా పవన్ రేణుదేశాయ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం బద్రి ఈ చిత్రం గతంలో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే…. ఆతర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు… కొన్నిరోజులకు వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు…