పవన్ కు హీరోయిన్ గా పూజా హెగ్దే….

పవన్ కు హీరోయిన్ గా పూజా హెగ్దే....

0
89

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే… ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ చిత్రం తర్వాత పవన్ క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి మరో సినిమా తీయబోతున్నాడు…

ఈ వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారు… ఇటీవలే పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ ని రీలీజ్ చేసిన సంగతి తెలిసిందే… గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ విళ్లిద్దరి కలయికలో సినిమా అన్న న్యూస్ రావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి…

ఈ చిత్రం గురించి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది… హరీష్ శంకర్ పవన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా పూజా నటించనుందని వార్తలు వస్తున్నాయి… ఇందుకు సంబంధించి త్వరలో అధికార ప్రకట వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు… కాగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే గద్దలకొండ గణేష్ చిత్రాల్లో పూజా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే…