పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబోలో సరికొత్త సినిమా రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి, దాదాపు గత ఏడాది నుంచి ఈ వార్తలు వినిపించాయి, అయితే తాజాగా పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స చేస్తున్నారు.. ఈ సమయంలో పూరీ సినిమా కూడా అనౌన్స్ చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి..అయితే ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లదు అని తెలుస్తోంది..దీనికి ఇంకా సమయం ఉంది.
కరోనా మహమ్మారి రాకపోయి ఉంటే ఇప్పటికి కథ వేరే విధంగా ఉండేది. మొత్తం నాలుగు సినిమాలు ఫిక్స్ అయ్యాయి..
తాజాగా పూరీతో పవన్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. పూరీ దర్శకత్వంలో బండ్ల గణేష్ ఓ సినిమా నిర్మంచనున్నాడని, అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తారు అని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా స్టోరీ అవినీతిపై యుద్దం పోరాటం చేసే వ్యక్తి ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. ఇక వకీల్ సాబ్ తర్వాత, క్రిష్ సినిమా చేస్తారు. ఆ తర్వాత అయ్యపనుమ్ కోషియుమ్ రీమేక్లో నటించనున్నాడు. సో అన్నీ సెట్ అయితే వచ్చే ఏడాది చివరి సమయానికి ఇది స్టార్ట్ అవుతుంది అంటున్నారు.