ప‌వ‌న్ రానా సినిమా – ఆ టైటిల్ ఏమై ఉంటుంది ?

Pawan kalyan Rana movie title

0
130

మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాని తెలుగులో రీమేక్ గా చేస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రానా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇక క‌రోనా వ‌ల్ల కొంత కాలంగా షూటింగ్ ఆగిపోయింది అయితే తాజాగా షూటింగు ప్రారంభం అయింది.

పోలీస్ ఆఫీసర్ గా పవన్ లుక్ ను రివీల్ చేస్తూ ఆయన పాత్ర పేరు భీమ్లా నాయక్ అనే విషయాన్ని వెల్లడించారు మేక‌ర్స్. ఇక రానా లుక్ కూడా రిలీవ్ చేస్తే ఈ సినిమా టైటిల్ అర్ధం అవుతుంది అంటున్నారు అభిమానులు.

మల‌యాళంలో ప్రధానమైన రెండు పాత్రల పేర్లను కలుపుతూ టైటిల్ పెట్టారు. ఇక్క‌డ టాలీవుడ్ లో కూడా అదే ఫాలో అవుతారు అని టాక్ న‌డుస్తోంది. అందుకే రానా పాత్ర ఎప్పుడు చెబుతారా అని చూస్తున్నారు.

సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కల్యాణ్ పుట్టినరోజు ఇక ప‌వ‌న్ ఫ్యాన్స్ కు ఆరోజు స్పెష‌ల్ ట్రీట్ ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఆ రోజు టీజ‌ర్ రిలీజ్ చేయ‌చ్చు అనే టాక్ న‌డుస్తోంది. ఇక సంక్రాంతికి ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌.