పవన్ – రానా సినిమా రిలీజ్… ఆ రోజేనా

0
98

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకి రీమేక్ గా తెలుగులో
పవన్ కల్యాణ్ – రానా చిత్రం చేస్తున్నారు.ఈ సినిమాకి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఇక మరికొంత షెడ్యూల్ చేయాల్సి ఉంది. అయితే వేగంగా ఈ సినిమాని పూర్తి చేయాలి అని చూస్తున్నారు.

అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై అభిమానులు వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. ఇప్ప‌టికే జనవరి 13వ తేదీన మహేశ్ బాబు సర్కారువారి పాటను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల తేదీ జనవరి 14 ఖరారు చేశారు.

అందుకే పవన్ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. చూడాలి దీనిపై వచ్చే రోజుల్లో ప్రకటన రానుంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు.