అదిరిపోయిన పవన్ కల్యాణ్ కొత్త సినిమా టైటిల్?

-

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ క్రమంలోనే మేనల్లుడు సాయితేజ్ తో కలిసి సముద్రఖని(Samuthirakani) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తైంది. మామ-అల్లుడు కలిసి తొలిసారి నటించిన సినిమా కావడంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్ ఇదేనంటూ ఓ వార్త సినిమా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీకి ‘దేవుడే దిగి వచ్చిన’ టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం’ రిమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని దేవుడి పాత్రలో పవన్(Pawan Kalyan) నటిస్తున్నాడు. ‘దేవుడే దిగి వచ్చిన’ టైటిల్ అయితే మూవీకి కరెక్ట్ గా సరిపోతుందని చిత్ర యూనిట్ భావించిందట. అందుకే ఈ టైటిల్ ఖరారు చేశారని గాసిప్స్ వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

- Advertisement -
Read Also: తనను అలా చూడం ఇబ్బందిగా అనిపించింది: అలియా భట్

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...