పవన్ సురేందర్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ ఆమేనా?

పవన్ సురేందర్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ ఆమేనా?

0
91

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేశారు, ఆయన సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు కూడా ఎస్ చెబుతున్నారు, అయితే రాజకీయాల నుంచి మళ్లీ సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథలు చెప్పేందుకు దర్శకులు ముందుకు వస్తున్నారు.

వేణుశ్రీరాం దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు పవన్ . తర్వాత క్రిష్ తో సినిమా చేస్తున్నారు. పవన్. క్రిష్ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. పీరియాడిక్ స్టోరీతో ఈ సినిమా రానుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ పవన్ సినిమా ఫిక్స్ అయ్యింది. అంటే అభిమానులకి వచ్చే ఏడాది వరకూఫుల్ హ్యాపీ.

ఇక వచ్చే ఏడాదిలో మరికొన్ని ప్రాజెక్టులు పట్టాలెక్కించనున్నారు, ఇక తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా ఉంది, ఈ సినిమాని పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ ఓ పవర్ ఫుల్ స్టోరీని సిద్ధంచేస్తున్నాడట… అయితే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తీసుకోవాలి అని చూస్తున్నారట.. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఆమె పవన్ తో నటించింది. సో దీనిపై ఇంకా ప్రకటన అయితే రావాల్సి ఉంది.