పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్(Pawan Kalyan) బాడీ లాంగ్వేజ్, ఫ్యాన్స్ అంచనాలు పూర్తిగా తెలిసిన దర్శకుడు హరీష్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ హోప్స్ పెంచేసుకున్నారు. దీనితో హరీష్ తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసే చిత్రాన్నే తెరకెక్కిస్తారని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ చిత్ర యూనిట్ ఒక షెడ్యూల్ కూడా ఫినిష్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఫ్యాన్స్‌కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా కొన్ని పోస్టర్స్ వదిలారు. గబ్బర్ సింగ్ టైంలో పవన్, హరీష్ షూటింగ్ లొకేషన్‌లో ఉన్న దృశ్యాలని.. ఉస్తాద్(Ustaad Bhagat Singh) సెట్స్ వీళ్ళిద్దరూ ఉన్న దృశ్యాలతో పోల్చుతూ ట్వీట్ చేశారు. దశాబ్దం గడిచినా హరీష్, పవన్ మధ్య బాండింగ్ మారలేదు అని అర్థం వచ్చేలా ఈ స్టిల్స్ ఉన్నాయి. తన టీం క్రియేట్ చేసిన ఈ పోస్టర్స్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా సర్ప్రైజ్ అయ్యారు..
Read Also:
1. బోల్డ్ సీన్స్ ఎఫెక్ట్.. భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన తమన్నా!!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat