పవన్ పింక్ సినిమా టైటిల్ పై క్లారిటీ – లాయర్ సాబ్ కాదు

పవన్ పింక్ సినిమా టైటిల్ పై క్లారిటీ - లాయర్ సాబ్ కాదు

0
100

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ పక్క రాజకీయాలు చేస్తూనే మరో పక్క తాజాగా ఆయన పింక్ సినిమా రీమేక్ చేస్తున్నారు.. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఒకే చేశారు.. అయితే పింక్ సినిమా గురించి ఆయన సినిమా టైటిల్ లాయర్ సాబ్ అని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి.

పింక్ రీమేక్ విషయానికొస్తే తామింకా టైటిల్ గురించి ఏమీ అనుకోలేదని, ఉగాదికి టైటిల్ అనౌన్స్ చేస్తామని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. బయట జరుగుతున్న ప్రచార టైటిల్ కు దీనికి సంబంధం లేదు అని తెలిపారు, అయితే ఆయన ఈ విషయం రివీల్ చేయడంతో లాయర్ సాబ్ అనే టైటిల్ దీనికి పెట్టలేదు అని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాని వేసవిలో విడుదల చేయనున్నారు అని తెలుస్తోంది ..బహుశా మే 15న రిలీజ్ కావొచ్చని వివరించారు. పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రం కూడా మే నెలలోనే 11వ తేదీ రిలీజై భారీ హిట్టయిందని తెలిపారు. సో ఈ సినిమా గురించి టైటిల్ ఉగాదికి రివీల్ చేయనుంది చిత్ర యూనిట్.