పవన్ పింక్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఇవే…

పవన్ పింక్ మూవీ లేటెస్ట్ అప్డేట్స్ ఇవే...

0
86

సార్వత్రిక ఎన్నికలు సుమారు నాలుగు సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు… ఏపీ రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నందున వెండితెరకు చాలా గ్యాప్ వచ్చింది…

అందుకే ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు పవర్ స్టార్ సిద్దమయ్యాడు… హిందీలో బ్లాక్ బస్టర్ అయిన పింక్ మూవీ రిమేక్ లో నటించనున్నరు పవన్…. ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు… తాజాగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…

పవన్ నటించబోతున్న పింక్ చిత్రం ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా చిత్రించాలని చూస్తున్నారట… తెలుగు ప్రేక్షకులకు అలాగే అభిమానులకు నచ్చిన రీతిలోనే మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది… కాగా ఈ చిత్రం ఈనెల 20 నుండి రీమేక్ షూటింగ్ మొదలు కానున్న సంగతితెలిసిందే… మొదటగా ఒక ఫైట్ చిత్రీకరస్తారట…