ప‌వ‌న్ రెండో సినిమాకి హీరోయిన్ ఫిక్స్

ప‌వ‌న్ రెండో సినిమాకి హీరోయిన్ ఫిక్స్

0
102

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌కీల్ సాబ్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే, ఈ సినిమా త‌ర్వాత ఆయ‌న క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నారు, అయితే ప్ర‌స్తుతం క‌రోనాతో వ‌కీల్ సాబ్ సినిమా షూటింగ్ కు బ్రేకులు ప‌డ్డాయి.. ఇక ఈ సినిమా పూర్తి చేసి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు.. కాని ఇప్పుడు ఈ చిత్రం మ‌రింత లేట్ అవ్వ‌నుంద‌ట‌.

ఇక వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ రెండో చిత్రం విడుద‌ల‌కానుంది, క్రిష్ ఇప్ప‌టికే ఈ సినిమాకై వ‌ర్క్ చేస్తున్నారు. మొఘలాయిల కాలం నాటి కథతో ఈ సినిమా నిర్మితం కానుంది. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ తిరగనుంది. ఆ వజ్రాన్ని చేజిక్కించుకునే దొంగగా పవన్ కల్యాణ్ కనిపించనున్నాడు అని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి జాక్వెలిన్ .. కీర్తి సురేశ్ పేర్లు వినిపించాయి. తాజాగా నివేదా పేతురాజ్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఆమెని తీసుకోవ‌డానికి మ‌రో కార‌ణం కూడా చెబుతున్నారు.. నివేదాకు ఇప్పుడు చాలా అవ‌కాశాలు వ‌స్తున్నాయి, ఆమెకి ఫ్యాన్స్ పెరిగారు పైగా ప‌వ‌న్ చాలా హైట్ గా ఉంటారు, ఇక నివేదా కూడా బాగా హైట్ అందుకే ఆమెని ఫైన‌ల్ చేశారు అనివార్త‌లు వ‌స్తున్నాయి.