పవన్ రెండో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది ఎప్పటి నుంచంటే

పవన్ రెండో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది ఎప్పటి నుంచంటే

0
155

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పింక్ సినిమా స్టార్ట్ అయింది.. అంతేకాదు ఆయన షూటింగ్ లో కూడా పాల్గొన్నారు, నిర్మాత దిల్ రాజు నిర్మిస్తోన్న పింక్ రీమేక్ షూటింగ్ మొన్నే మొదలైంది ..కాబట్టి ఇక పవన్ కల్యాణ్ రాజకీయాలు సినిమాలు రెండూ బేలన్స్ చేస్తూ ఉంటారు అని అందరూ అనుకుంటున్నారు.

అయితే పవన్ తన సినిమాల స్పీడు మరింత పెంచాలి అని అనుకుంటున్నారట, అవును ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది.. కాని మరో సినిమాని కూడా ఆయన స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.. పవన్ ఇంకో సినిమాను కూడా మొదలుపెట్టబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్లో చేస్తున్నారని వార్తలు వచ్చాయి, ఇందులో పవన్ ఒక దొంగ పాత్రలో కనిపిస్తాడట. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్ డేట్ తెలిసింది. ఈ నెల 27 నుండి ఈ సినిమా హైదరాబాద్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారట.. అయితే ఆయన కూడా తొలి షెడ్యూల్ లో పాల్గొంటారని, తర్వాత కొద్ది రోజులు పింక్ చిత్ర షూటింగ్ లో పాల్గొని, తర్వాత ఈ సినిమా షూటింగ్ కు వస్తారు అని వార్తలు వస్తున్నాయి, మరి ఈ వార్త నిజమా కాదా అనేది చూడాలి.