పాయ‌ల్ రాజ్ పుత్ ల‌వ‌ర్ ఎవ‌రో తెలుసా అత‌ని బ్యాగ్రౌండ్ ఇదే

పాయ‌ల్ రాజ్ పుత్ ల‌వ‌ర్ ఎవ‌రో తెలుసా అత‌ని బ్యాగ్రౌండ్ ఇదే

0
106

ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకుంది అందాల ఉత్త‌రాధి భామ పాయ‌ల్ రాజ్ పుత్.. ఆమె అందానికి యువ‌త ఫిదా అయ్యారు.. వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి.. టాలీవుడ్లో పాయ‌ల్ కు మంచి ఫేమ్ వ‌చ్చింది.

ఇటీవ‌ల పాయల్ రాజ్ పుత్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోంది అని వార్త‌లు వ‌చ్చాయి. ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కొన్న నెలల క్రితమే పాయల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆవ్య‌క్తి ఎవ‌రా అని చాలా మంది సోష‌ల్ మీడియాలో సెర్చ్ చేశారు..

ఇప్పుడు మ‌రోసారి అత‌నితో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది.అతనే తన ప్రాణం అని పాయల్ తమ ప్రేమకథను అభిమానులతో పంచుకుంది. పాయల్ ప్రియడి పేరు సౌరభ్ డింగ్రా. అతను ముంబైకి చెందిన మోడల్. చాలా కాలంగా అతనితో పాయల్ డేటింగ్ చేస్తోంది. అని తెలుస్తోంది, అయితే ఈ రోజు సౌర‌భ్ బర్త్ డే అందుకే పుట్టిన రోజు కేక్ క‌ట్ చేయించి అత‌నితో ఉన్న ఫోటోలు షేర్ చేసింది

నాలోని లోపాలను కూడా ప్రేమించే ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ కంటే విలువైన వ్యక్తి నా జీవితంలో మరెవరూ లేరు. మనిద్దరం కలిసి గడిపిన ప్రతి క్షణం నాకు మధుర జ్ఞాపకమేఅని ట్వీట్ చేసింది. అలా ఈ అమ్మ‌డి ల‌వ‌ర్ ని అభిమానుల‌కి ప‌రిచ‌యం చేసింది.