నేను ఆ ఫుడ్ ఎక్కువ తింటా – పాయల్

నేను ఆ ఫుడ్ ఎక్కువ తింటా - పాయల్

0
100

హీరోయిన్లు దేని గురించి అయినా చెబుతారు కాని మీ డైట్ ఏమిటి అంటే చెప్పరు.. చాలా తక్కువ తిండి తీసుకుంటాం అని చెబుతారు, అంతా ఫ్రూట్స్ జ్యూస్ మాత్రమే తాగుతాము అని చెబుతారు.నాన్-వెజ్ కు దూరంగా ఉంటామని ఇలా రకరకాలుగా చెబుతుంటారు. అయితే తాజాగా హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించుకున్న
పాయల్ రాజ్ పుత్ మాత్రం వీటన్నింటికీ రివర్స్. తను పుట్టిందే తినడం కోసం అంటోంది పాయల్.

తను ఫుడ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటోంది. కొన్ని రోజుల కిందట మోకాలికి దెబ్బ తగిలింది. అప్పట్నుంచి చిన్న చిన్న వర్కవుట్స్ కూడా చేయడం మానేశాను అంటోంది ఈ ముద్దుగుమ్మ, అందుకే ఐదు కేజీల బరువు పెరిగాను అంటోంది, అయితే పిజ్జా దోశ అంటే తనకు ఇష్టం అని నచ్చింది తింటాను అని చెబుతోంది.

పొద్దున లేస్తే ఏం తినాలా అని ఆలోచిస్తుంటాను. ఫిట్ గా అలాగే బొద్దుగా కనిపిస్తా అని చెబుతోంది పాయల్, అయితే ఆమెకు వంట చేయడం కూడా ఇష్టం అని చెబుతోంది, మా ఇంట్లో వారానికి ఒకసారైనా నేను వంట చేస్తా. నేను పంజాబీ కాబట్టి నాకు రాజ్మా రైస్ అంటే చాలా ఇష్టం అని చెబుతోంది, హైదరాబాద్ లో చాలా వెజ్ వెరైటీస్ తిన్నాను అని చెబుతోంది. అయితే ఏమి తిన్నా కచ్చితంగా ఎక్సర్ సైజులు చేయాలి అని చెబుతోంది.