తెలుగులో ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది- పాయల్ రాజ్ పుత్

తెలుగులో ఆ ముగ్గురు హీరోలతో నటించాలనుంది- పాయల్ రాజ్ పుత్

0
106

ఆర్ఎక్స్100 చిత్రంలో తన నటనతో అందంతో మంచి పేరు సంపాదించుకుంది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, ఇక వరుసగా ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి, అందం అభినయం ఉండటంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆమెకు పెరిగింది.

కుర్రకారు ఇప్పటికీ ఆమె సినిమాలు అంటే తెగ ఇష్టపడతారు..వెంకీమామ చిత్రంలో వెంకటేశ్ సరసన కూడా నటించి, మెప్పించింది, తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించింది.ఈ సమయంలో తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్ కు ఒక ప్రశ్న ఎదురైంది.

ఇక వెంటనే సమాధానం చెప్పింది, ఈ అందాల భామ పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను పాయల్ బయట పెట్టింది. సో మరి దర్శకులు ఆమె కోరిక వినే ఉంటారు, కచ్చితంగా మీకు అవకాశాలు వస్తాయి అని అభిమానులు కోరుకున్నారు.