పెద్ద వ్యాపార‌వేత్త‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్

పెద్ద వ్యాపార‌వేత్త‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్

0
100

ఈ ఏడాది అల వైకుంఠ‌పురం చిత్రంతో స‌రికొత్త రికార్డులు తిర‌గ‌రాశారు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్… అయితే ఇప్పుడు ఆయ‌న మ‌రో సినిమా ప్లాన్ చేస్తున్నారు, ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్ తో త్రివిక్ర‌మ్ సినిమా చేయ‌నున్నారు, తారక్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం పూర్తి అయిన త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఎన్టీఆర్ 30 వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హారిక – హాసిని క్రియేషన్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి క‌ధ వ‌ర్క్ జ‌రుగుతోంది, ఇక త్రివిక్ర‌మ్ టీమ్ ఈ ప‌నిలోనే బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక్కో విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తోంది.

పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడట త్రివిక్రమ్… దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్..
ఇక ఇందులో ఆయ‌న పొలిటిక‌ల్ లీడ‌ర్ గా న‌టిస్తార‌ట‌. ఇక ఇందులో తార‌క్ పెద్ద వ్యాపార‌వేత్త‌గా క‌నిపించ‌నున్నార‌ట‌.