పెళ్లిచూపులు దర్శకుడికి మెగా ప్రాజెక్ట్

పెళ్లిచూపులు దర్శకుడికి మెగా ప్రాజెక్ట్

0
99

పెళ్లి చూపులు ఈ నగరానికి ఏమైంది సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్ …నటనలో కూడా ఆయన మంచి పేరు సంపాదించారు, అయితే ప్రస్తుతం ఆయన వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేశారు అని వార్తలు వస్తున్నాయి..

తాజాగా వెంకటేష్ ఓ సినిమాని సెట్స్ పై పెట్టారు… ఈ చిత్రం నారప్ప.. అది వెంకీ ఫిల్మ్ కెరియర్ లో 74 వ చిత్రంగా ఉంది. తమిళ రీమేక్ చిత్రం దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ వారే నిర్మిస్తున్నారు..

ఇక ఆయన 75 వ చిత్రం తరుణ్ భాస్కర్ తో ఫిక్స్ చేసుకున్నారట.. ఇప్పటికే వెంకీకి కధ చెప్పడం ఆయన ఒకే చేయడం కూడా అయింది అని తెలుస్తోంది…. ఇక పూర్తి స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నారట ఆయన..
ఈ సినిమాను కూడా సురేశ్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నట్టు తెలుస్తోంది. హార్స్ రేసింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు, ఇక ఈ సినిమా నారప్ప షూటింగ్ పూర్తి అయిన తర్వాత వెంకీ 20 రోజులు గ్యాప్ తీసుకుని స్టార్ట్ చేయనున్నారట.