పెళ్ళిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఛార్మి? వరుడు ఎవరంటే

పెళ్ళిపీటలు ఎక్కబోతున్న హీరోయిన్ ఛార్మి? వరుడు ఎవరంటే

0
98

టాలీవుడ్ లో ఇటీవల చాలా మంది హీరోయిన్లు వివాహం చేసుకుంటున్నారు, అయితే ఈ జాబితాలో మరో అందాల తార రానుందట, మరి ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ ఛార్మీ, ఆమె సినీ రంగంలోకి అడుగుపెట్టి 19 ఏళ్లు గడుస్తోంది.

ఈ పంజాబీ భామ తన అందచందాలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. అందరూ హీరోలతో ఆమె సినిమాలు చేసింది.

 

ఛార్మీ ప్రస్తుతం నటనకు దూరంగా ఉంది… దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.

అయితే తాజాగా ఓ వార్త వినిపిస్తోంది, ఆమె పెళ్లి చేసుకోబోతోందట. మరి వరుడు ఎవరు అంటే తన సమీప బంధువును ఛార్మి పెళ్లాడబోతోందట. ఇక కుటుంబ సభ్యులు కొంత కాలంగా ఆమెకి వివాహం చేయాలి అని చూస్తున్నారు..

 

ఇక బంధువుల అబ్బాయితో ఆమెకి పెళ్లి ఫిక్స్ చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి దీనిపై ఆమె నుంచి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది, మొత్తానికి టాలీవుడ్ లో మరోపెళ్లి వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.