డైరెక్టర్‌గా పీటర్ హెయిన్స్.. సెన్సేషనల్ నిర్మాత.. క్రేజీ ప్రాజెక్ట్‌తో..!!

డైరెక్టర్‌గా పీటర్ హెయిన్స్.. సెన్సేషనల్ నిర్మాత.. క్రేజీ ప్రాజెక్ట్‌తో..!!

0
219

దేశవ్యాప్తంగా గొప్ప యాక్షన్ డైరెక్టర్‌గా గొప్ప పేరు సంపాదంచుకొన్న పీటర్ హెయిన్స్ దర్శకత్వం చేపట్టబోతున్నారు. అప‌రిచితుడు, శివాజీ, గ‌జిని, మ‌గ‌ధీర‌, రోబో, విల‌న్‌, విక్ర‌మ సింహ‌, బాహుబ‌లి, మ‌న్యం పులి…లాంటి సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫి చేశారు. తాజాగా డైరెక్టర్‌గా పీట‌ర్ హెయిన్స్ స్టార్ట్… కెమెరా… యాక్ష‌న్‌ అని చెప్పబోతున్నాడు.

ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు.. యాక్షన్ ప్రధానంగా ఉంటుందా.. ఇలాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. టాలీవుడ్ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించి హీరో, హీరోయిన్లు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. నిజానికి ఈ విషయమై కొద్దిరోజుల నుండి సర్కులేట్ అవుతున్నప్పటికీ అధికారికంగా ఎక్కడా న్యూస్ బయటకు రాలేదు. మరి ఫైట్ మాస్టర్‌గా అదరగొట్టిన పీటర్ హెయిన్స్ దర్శకుడిగా ఏ రేంజ్‌లో అలరిస్తాడో చూడాలి..