నివేద పేతురాజ్ అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ.. ఆమెకి వరుసగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, టాలీవుడ్ లో వరుస పెట్టి ఆమెకి ఛాన్సులు వస్తున్నాయి అనే చెప్పాలి, ఇక హీరోయిన్ గా చేస్తూనే పాత్ర నచ్చితే ప్రత్యేక రోల్ చేయడానికి ఆమె ముందుకు వస్తున్నారు.
తాజాగా మరో ఆఫర్ వచ్చింది నివేద పేతురాజ్ కు… . రానా దగ్గుబాటి సాయిపల్లవి జంటగా రూపొందుతున్న విరాటపర్వం సినిమాలో నివేద ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు, డిఫరెంట్ జోనర్ లో ఈ చిత్రం రానుంది.
నక్సలిజం నేపథ్యంలో ఈ విరాటపర్వం సినిమా రూపొందుతోంది, ఇటు రానా అభిమానులు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు…. తాజా షూటింగ్ షెడ్యూలు ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. రానా, సాయిపల్లవితో పాటు నివేద కూడా షూటింగులో జాయిన్ అయింది, సో ఆమె ప్రత్యేక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారట..