విడాకుల ప్రకటనకు ముందు రజినీకాంత్ కు ఫోన్‌ కాల్‌..అసలేం జరిగిందంటే?

0
104

తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. వీరికి 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

వీరి విడాకులకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకొచ్చింది. విడాకుల నిర్ణయానికి ముందు ఇద్దరూ రజనీకాంత్‌కు ఫోన్‌ చేశారట. అయితే రజనీకాంత్‌ మాత్రం ఆ నిర్ణయాన్ని వారిద్దరకే వదిలేసినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు చాలా సార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చినప్పటికీ.. తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని చెప్పి సోమవారం సోషల్‌ మీడియా ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు.

అయితే రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ నిర్మించిన ‘కాలా’సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఆ సమయంలో రజనీకాంత్‌  ఆర్థికంగా ఆదుకోలేదని, అప్పటి నుంచి ధనుష్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధనుష్‌తో ఐశ్వర్య ఓ పాన్‌ ఇండియా సినిమా నిర్మించాలని ప్రయత్నించగా.. ఆయన ఒప్పుకోలేదని , ఈగోల కారణంగానే వీరిద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.