కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని మోడీ, పవన్ కళ్యాణ్, సీఎం కేసీఆర్ సంతాపం

0
111

సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. 83 ఏళ్ల రెబల్ స్టార్ గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సినీ పరిశ్రమలో ప్రత్యేక పంథా కలిగిన నటుడు కృష్ణం రాజు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్

కృష్ణంరాజు మృతి బాధాకరం. కేవలం సినిమాలే కాదు సమాజసేవ చేసే మంచి మనసున్న వ్యక్తి. రాజకీయాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలుపుతున్నానని ఓం శాంతి అని ప్రధాని మోడీ, అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు.

కృష్ణంరాజు మరణ తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన ప్రజల మనసులో నిలిచిపోతారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తాం-సీఎం కేసీఆర్