పోకిరి సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఏమిటో తెలుసా

పోకిరి సినిమాకి ముందు అనుకున్న టైటిల్ ఏమిటో తెలుసా

0
72

పూరీ జగన్నాథ్, మహేశ్బాబు కాంబినేషన్లో వచ్చిన చిత్రం పోకిరి….టాలీవుడ్ లో ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే….ఈ సినిమా ప్రతీ తెలుగు వ్యక్తికి నచ్చింది.. మహేష్ బాబు ఇక ఈ సినిమా నుంచి వెనుదిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి..

 

2006లో వచ్చిన ఈ మూవీ బాక్సాపీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.. అప్పట్లో ఈ సినిమాకి పది కోట్ల వరకూ ఖర్చు అయిందంటారు.. ఇక బాక్సాఫీస్ దగ్గర సుమారు 50 నుంచి 70 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు వచ్చి ఉంటాయి అని టాక్ నడిచింది… అయితే ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్గా చాలా సెంటర్లలో వంద రోజులు ఆడింది పోకిరి చిత్రం.

 

పూరీ జగన్నాథ్ బద్రీ సినిమాకు ముందే ఈ స్టోరీ రాసుకున్నారట. ఇక హీరోగా రవితేజని అనుకున్నారట,

ఉత్తమ్ సింగ్..సన్నాఫ్ సూర్య నారాయణ టైటిల్ కూడా అనుకున్నారు పూరీ జగన్నాథ్. .. అయితే ఈ సినిమా ప్రారంభించలేదు, తర్వాత ఈ స్టోరీ మహేష్ కు చెప్పారు… ఆయన ఒకే చేశారు.. అక్కడక్కడా కొన్ని మార్పులతో ఈ సినిమా పట్టాలెక్కింది.. మహేష్ కు సూపర్ హిట్ వచ్చింది.