ఫ్లాష్ న్యూస్ – కరోనా వైరస్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి

ఫ్లాష్ న్యూస్ - కరోనా వైరస్‌తో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మృతి

0
81

ఈ వైర‌స్ కేసులు దేశంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌, చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కూడా చాలా మందికి ఈ వైర‌స్ సోకుతోంది, బీటౌన్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మందికి ఈ వైర‌స్ సోకింది, అతి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు ప్ర‌జ‌లు.

అయితే తాజాగా ఓ సినిమా నిర్మాత వైర‌స్ బారిన ప‌డ్డారు అంతేకాదు వైర‌స్ అటాక్ అయి ఆయ‌న మ‌ర‌ణించారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత పోకిరి రామారావు ఆయ‌న వ‌య‌సు 64 ఏళ్లు, కరోనాతో కన్నుమూశారు. ఆయ‌న అనారోగ్యంతో కొన్నిరోజులుగా హైద‌రాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

అయితే క్రమంగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా విష‌మించడంతో ఈ రోజు ఉదయం 9 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయ‌న మ‌ర‌ణంతో కుటుంబం స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు, సినిమా నిర్మాణ సంస్ధ అయిన ఈ త‌రం ఫిలింస్ అధినేత పోకూరి బాబూరావు సోద‌రుడే పోకూరి రామారావు. ఈ త‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన పలు చిత్రాల‌కు ఆయన చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మ‌ర‌ణ వార్త విని తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సంతాపం తెలిపారు.