‘గేమ్ ఛేంజర్‌’ సాంగ్ లీక్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..

-

RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్టర్ మూవీ త‌ర్వాత గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’(Game Changer). పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంక‌టేశ్వర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ మీద దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ చిత్రంలోని ‘జరగండి జరగండి’ అనే పాట సోషల్ మీడియాలో లీకైంది. దీనిపై నిర్మాత దిల్‌రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్‌ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

- Advertisement -

Game Changer | అయితే దీపావళి కానుకగా ఈ సినిమాలోని ‘జరగండి.. జరగండి.. ‘ అనే లిరికల్ పాటను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ఇటీవల ప్రకటించింది. సంగీత దర్శకుడు థమన్ అందించిన ఈ పాట సినిమాకే హైలైట్‌ కానుందని టీమ్ పేర్కొంది. ఈ పాటను రూ.20కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమాచారం. దీంతో ఈ పాట కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కియారా అడ్వాణీ(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read Also: బరువు తగ్గాలి అనుకునేవారికి సగ్గుబియ్యం ఓ వరం!!
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Revanth Reddy | తెలంగాణ సీఎంగా రేవంత్ పేరు ఫిక్స్ చేసిన అధిష్టానం

తెలంగాణ సీఎం ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. టీపీసీసీ చీఫ్ రేవంత్...

Telangana Assembly | మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్ నోటిఫికేషన్

Telangana Assembly | తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెటిజ్...