Allu Arjun | పుష్పరాజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసుల..

-

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు సంబంధించే ఈ అరెస్ట్ చేశారు. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధిత కుటుంబం.. ఈ ఘటనపై కేసు నమోదు చేసింది. ఇందుకు అల్లుఅర్జున్ బాధ్యతారాహిత్యమే కారణమంటూ.. అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈరోజు అల్లు అర్జున్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

అయితే ఇప్పటికే తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ అల్లు అర్జున్(Allu Arjun).. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై ఇంకా విచారణ జరగాల్సి ఉంది. ఇంతలోనే చిక్కడపల్లి పోలీసులు.. అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also: క్షమాపణలు కోరిన మోహన్ బాబు.. చాలా బాధగా ఉందంటూ..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...