పోలీసుల కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ చేసింది తెలిస్తే శ‌భాష్ అంటారు

పోలీసుల కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ చేసింది తెలిస్తే శ‌భాష్ అంటారు

0
128

ఈ క‌రోనా స‌మ‌యంలో వైద్యులు పోలీసులు న‌ర్సులు పారిశుద్య కార్మికులు చేసే సేవ‌లు ఎవ‌రూ కూడా మ‌ర్చిపోలేరు, వారు లేనిదే స‌మాజం ఇలా ఉంటుందా ఒక‌సారి గుర్తు తెచ్చుకుంటేనే భ‌యం వేస్తోంది, అందుకే ఈ స‌మ‌యంలో వారి జాగ్ర‌త్త కూడా చూసుకోవాల్సిన స‌మ‌యం

ఇక పోలీసులు నిత్యం రోడ్ల‌పైనే ఉంటున్నారు.. డాక్ట‌ర్లు నిత్యం ఆస్ప‌త్రుల్లోనే ఉంటున్నారు ఈ స‌మ‌యంలో వారికి చాలా మంది మాస్కులు శానిటైజ‌ర్లు అందిస్తున్నారు.. వారికి హెల్త్ కిట్స్ కూడా అందిస్తున్నారు.

అయితే సినిమా ఇండ‌స్ట్రీ నుంచి చాలా మంది విరాళాలు కూడా అందించారు, సినిమా కార్మికుల‌ని ఆదుకునేందుకు ముందుకు వ‌చ్చారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి ప‌ని చేశారు
తెలంగాణలోని 1450 మందికి ఫేస్ ప్రొటెక్షన్ షీల్డ్ లను పంపిణీ చేశారు..