పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి

పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి

0
99

చాలా మంది కేటుగాళ్లు సినిమా సెల‌బ్రిటీల పేరుతో అనేక మోసాలు చేస్తున్నారు, చివ‌ర‌కు మోస‌పోయిన వారు ల‌బోదిబోమ‌ని స్టేష‌న్ కు ప‌రుగులు పెడుతున్నారు, ఏకంగా ల‌క్ష‌ల రూపాయ‌లు పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఇలాగే సినిమా అవ‌కాశాలు ఇస్తాం మోడ‌ల్ ని చేస్తాం హీరోయిన్ గా చేస్తాం అని ఆశ చూపిస్తారు న‌గ‌దు దోచేస్తారు.

త‌మ‌కు ఈ ద‌ర్శ‌కులు హీరోతెలుసు అని క‌వ‌రింగ్ ఇస్తారు, కాని అస‌లు విష‌యం తెలిసి మోస‌పోయాము అని గ్ర‌హిస్తారు. ఇలా సెల‌బ్రిటీల‌ పేరుతో మోసం చేస్తున్నారు అని గ్ర‌హించి వెంట‌నే ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు.

కొందరు యువతులు కేటుగాళ్ల వలలో పడి మోసపోగా, వారిని మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేశారు ద‌ర్శ‌కుడు అజ‌య్ … బాన్సువాడకి చెందిన సాయి కిరణ్ అనే వ్య‌క్తి ఇలా మోసం చేసే ప్రయత్నం చేశాడు. దీంతో పక్కా ప్రణాళికతో సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.