పొలిటికల్ రీ ఎంట్రీపై టాలీవుడ్ బడాప్రొడ్యూసర్ క్లారిటీ….

పొలిటికల్ రీ ఎంట్రీపై టాలీవుడ్ బడాప్రొడ్యూసర్ క్లారిటీ....

0
108

తెలుగు చిత్ర పరిశ్రమకు చెంది చాలా మంది హీరోలు హీరోయిన్లు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు… మరి కొందరు సక్సెస్ కాలేక ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ తిరిగి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేశారు… అలా సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన వారిలో ఒకరు నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఒకరు…

గతంలో బండ్ల గణేష్ తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం తీసుకుని ప్రచారం చేశారు… అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిని చవిచూడటంతో ఆయన కొన్ని రోజులు పత్తా లేకుండా పోయారు… అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తాను ఉరి వేసుకుని చనిపోతానని కూడా చెప్పారు..

ఇది ఇలా ఉంటే తాజాగా ఆయన గతంలో మాట్లాడిని మాటలను ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు… ఈ వీడియోలపై ఆయన స్పందించారు… తాను రాజకీయల్లో ఉన్న సమయంలో మాట్లాడిని మాటలను పోస్టులు చేస్తున్నారని అటువంటి పోస్టులు చేయవద్దని అన్నారు… తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అన్నారు… ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని అన్నారు…