పూజ హెగ్డే సినిమా కి ఆ పొలిటిషన్ సపోర్ట్.. ఏందీ సంగతి..!!

పూజ హెగ్డే సినిమా కి ఆ పొలిటిషన్ సపోర్ట్.. ఏందీ సంగతి..!!

0
104

పూజ హెగ్డే టాలీవుడ్ కి ఇచ్చిన రీ ఎంట్రీ లో దూసుకుపోతుంది.. తాజాగా ఆమె నటించిన గద్దలకొండ గణేష్ సినిమా సూపర్ హిట్ కాగా, ఆమె చేతిలో ప్రస్తుతం అరడజను బడా సినిమాలు ఉన్నాయంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పొచ్చు.. అంతేకాకుండా ఆమె బాలీవుడ్ లోనూ నటిస్తుంది.. దీంట్లో భాగంగానే హౌస్ ఫుల్ 4 అనే సినిమాల్లో నటించింది ఈ భామ. కాగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది పూజ. అయితే అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ముక్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే ముఖ్య పాత్రల్లో నటిస్తున్న హౌస్ ఫుల్ 4 చిత్రం ప్రమోషన్స్ ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కూడా చేస్తున్నారు.

అదెలా అంటారా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ హౌస్ ఫుల్ 4 ఎక్స్ ప్రెస్ అనే కొత్త రైల్ ని ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రైళ్లో నటీనటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. అయితే ఈ విధంగా రైల్వే శాఖ ప్రజలకు మరింత చేరువ అవుతుందని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రమోషన్స్ ఆన్ వీల్స్ అనే పేరు కూడా పెట్టారు మంత్రి. అయితే ఈ రైలు ద్వారా నటులు తమ తమ సినిమా ప్రమోషన్స్ చేసుకోవచ్చని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మంత్రి .