మాస్ రాజాకు ఆ హీరోయిన్ కిక్ ఇవ్వనుందా…

మాస్ రాజాకు ఆ హీరోయిన్ కిక్ ఇవ్వనుందా...

0
125

తెలుగులో వరుస చిత్రాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్దే… ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు ఏకైక ఆప్షన్ గా మారింది.. ప్రస్తుతం తెలుగు హిందీ సిమాలతో ఉన్న పూజా ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుందని టాక్….

కథ నచ్చితే చాలు హీరో ఎవరన్నది పూజా చూడదంటారు.. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది.. మాస్ రాజా రవితేజ దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది.. ఈ చిత్రంలో రవితేజా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడట…

అయితే ఈ సినిమాలో రవితేజ చేయబోయే రెండు పాత్రల్లో ఒక పాత్రకు పూజా హెగ్దేను తీసుకుంటే భాగుంటుందని భావిస్తున్నారు… ప్రస్తుతం వరుస ప్లాఫ్ లతో ఉన్న రవితేజ సినిమాకు పూజా హెగ్దే ఒకే అంటుందో లేదో చూడాలంటున్నారు… కాగా ఈ చిన్నది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాధేశ్యాం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే…