ప్రభాస్ పై పూజా హెగ్డే కామెంట్లు వింటే మతిపోతుంది

ప్రభాస్ పై పూజా హెగ్డే కామెంట్లు వింటే మతిపోతుంది

0
87

డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికి ఇష్టమే, సినిమా పరిశ్రమలో ఆయన అంటే అందరికి ప్రేమ ఉంటుంది…ఎవరితోనూ విభేదాలు కూడా ఉండవు.. హీరోయిన్స్ కు కూడా ప్రభాస్ అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది, ఇక హీరోయిన్స్ ఆయనతో ఓ సారి సినిమాలు చేశారు అంటే రిలేషన్ మెయింటైన్ చేస్తారు, అంత గొప్ప మంచి మనసు ప్రభాస్ ది అని చెబుతారు.

తాజాగా బ్యూటీ పూజా హెగ్డే ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తింది . ఆమెను మీకు పరిశ్రమలో ఇష్టమైన హీరో ఎవరని అడిగితే వెంటనే ప్రభాస్ అని చెప్పేసింది. ప్రభాస్ లాంటి నైస్ అండ్ స్వీట్ పర్సన్ ని నేను పరిశ్రమలో చూడలేదని చెప్పుకొచ్చారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆమెపై తమ ఇష్టాన్ని చూపుతున్నారు. ఆమె గురించి కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఆమె ప్రస్తుతం జాన్ అనే అన్ టైటిల్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది.. ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు.. 1960ల కాలంలో యూరప్ నేపథ్యంలో జరిగే ప్రేమ కథ గా దీనిని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ 50 శాతం పూర్తి అయింది.. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. ప్రభాస్ చిరకాల మిత్రులైన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.