పీకల్లోతు ప్రేమలో పూజా హెగ్డే- అబ్బాయి ఎవరంటే

పీకల్లోతు ప్రేమలో పూజా హెగ్డే- అబ్బాయి ఎవరంటే

0
110

బుట్టబొమ్మ అంటే మనం వెంటనే చెప్పేపేరు అందాల రాశి పూజా హెగ్డే, అయితే టాలీవుడ్ లో చాలా బిజీఎస్ట్ హీరోయిన్ గా ఆమె మారిపోయింది ,ఇక అగ్రహీరోల సినిమాలు అంటే దర్శక నిర్మాతలు ముందు ఆమెని ఎంపిక చేస్తున్నారు.. వరుసగా ఆమె సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్ధానం సంపాదించుకుంది.

ఇక టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ శాండిల్ వుడ్ నుంచి అవకాశాలు ఆమెకి వస్తున్నాయి.. అంతే స్పీడుగా బాలీవుడ్ లోకూడా రెండు సినిమాలు చేస్తోంది. దాదాపు ఆమె చేతిలో అన్నీ కలిపి ఐదు సినిమాలు ఉన్నాయి అని తెలుస్తోంది..తాజాగా పూజా గురించి ఓ వార్త బీ టౌన్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.

పూజా ప్రేమలో పడిందట… బాలీవుడ్లోని ఓ స్టార్ హీరో తనయుడితో పీకల్లోతు ప్రేమలో ఉందట. బాలీవుడ్ మూవీ బజార్ చిత్రంతో పాపులరైన సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ వినోద్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో పడిందని అంటున్నారు. వీరిద్దరు పలు చోట్ల కలిసి పార్టీలకు కూడా వెళుతున్నారట, కాని ఈ వార్తపై పూజా మాత్రం ఎక్కడా స్పందించలేదు.