పూజా హెగ్డేకు మరో బిగ్ ఆఫర్

పూజా హెగ్డేకు మరో బిగ్ ఆఫర్

0
98

టాలీవుడ్ లో ఇప్పుడు దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు, ఆమె వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంది, ఇక బాలీవుడ్ లో కూడా ఆమె తన నటనతో అక్కడ మెప్పించింది. సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు కొట్టేసింది. ఇక తెలుగులో సూపర్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.

తాజాగా ఆమెకు మరో బిగ్ ఆఫర్ వచ్చిందట…. స్వప్న సినిమా బ్యానర్పై దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర పూజకు దక్కిందట.

ఇక కధ నచ్చడంతో ఆమె ఒకే చెప్పింది, అంతేకాదు ఆమె ఈ సినిమా హిట్ అయితే తమిళ మళయాళం నుంచి కూడా ఫిల్మ్ అవకాశాలు వస్తాయి అని ఆలోచన చేసింది, తన ప్రస్తుత ప్రాజెక్టుల తర్వాత ఈ చిత్రం స్టార్ట్ అవ్వనుందట.