మెగాహీరోతో పూజా హేగ్డే – భారీ ప్రాజెక్ట్ – టాలీవుడ్ టాక్

Pooja hegde new movie with mega star chiranjeevi

0
97

టాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది హీరోయిన్ పూజా హేగ్డే. ఏ కొత్త సినిమా అయినా ఆమెని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. యూత్ కి కూడా బాగా నచ్చిన హీరోయిన్. ఇప్పుడు ఆమె చేతినిండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఆమెకి వరుస విజయాలు అందుతున్నాయి. వ‌రుస‌పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి ఆమె పేరు ని పరిశీలిస్తున్నారట. ఈ సినిమా కథ పై పూర్తి వర్క్ చేశారు హరీశ్ శంకర్ . ఒకవేళ హరీశ్ ఆమెని ఈ సినిమాలో చేయమని అడిగితే కచ్చితంగా ఒకే చెబుతుంది అంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

ఎందుకంటే ? పూజ హెగ్డే కెరియర్ ఊపందుకుంది హరీశ్ చేసిన దువ్వాడ జగన్నాథం సినిమాతో, ఈ చిత్రంలో బన్నీ సరసన నటించింది. కచ్చితంగా ఆమె పవన్ సినిమాలో కూడా అవకాశం వస్తే నటిస్తుంది అంటున్నారు. చూడాలి అఫీషియల్ ప్రకటన వచ్చేవరకూ.