ప్రభాస్ చిత్రంలో పూజా అలా నటిస్తుందట? రోల్ ఏమిటంటే?

ప్రభాస్ చిత్రంలో పూజా అలా నటిస్తుందట? రోల్ ఏమిటంటే?

0
98

ప్రభాస్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ చూసి అందరికి మతిపోయింది, సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది,ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నారు, ఈ కరోనా సమయంలో చిత్ర యూనిట్ షూటింగులకి బ్రేకులు ఇచ్చింది, త్వరలో వైరస్ ప్రభావం తగ్గాక మళ్లీ షూటింగ్ ప్రారంభిస్తారు.

ప్రభాస్ సరసన పూజా హెగ్డే చేస్తోంది. ఫస్ట్ లుక్తో పాటు టైటిల్తో కూడిన పోస్టర్ను ఇటీవలే రిలీజ్ చేసారు. ఈపోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్ పూజ హెగ్డే రొమాంటిక్ లుక్ ను చూపించారు. ఇక అభిమానులు చిత్రం ఎంత బాగుంటుందో అని ఆశలు పెట్టుకున్నారు.

రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందట. సినిమాలో ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక అన్నీ సెట్ అయితే ఈ సినిమా వచ్చే ఏడాది 2021 సమ్మర్ లో రిలీజ్ చేస్తారట, దాదాపు మరో నెల రోజులు సమయం తీసుకుంటారట షూటింగ్ ప్రారంభించడానికి అని తెలుస్తోంది.