పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే..’లా లా భీమ్లా’ పాట డీజే వెర్షన్​ ఆగయా..

Poonakale for Pawan fans .. Is the DJ version of the song 'La La Bhimla' here ..

0
95

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మూవీ భీమ్లానాయక్. ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నిత్యామేనన్, సంయుక్త హెగ్డే హీరోయిన్లు. తమన్ సంగీతమందించారు. స్క్రీన్​ప్లే, మాటలను త్రివిక్రమ్​ అందించారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 25న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

దీనితో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా న్యూ ఇయర్ జోష్​ను మరింత పెంచేందుకు ‘లా లా భీమ్లా’ సాంగ్ డీజే వెర్షన్​ రిలీజైంది. ఇప్పటికే విడుదలైన పాట అభిమానుల్ని అలరిస్తూ, యూట్యూబ్​లో దూసుకెళ్తుంది. ఈ పాటలో లుంగీ, పోలీస్​ డ్రస్​లో కనిపించిన పవన్.. ‘భీమ్లా నాయక్’ సినిమాపై అంచనాల్ని పెంచుతున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ మీదున్నాడు. పవన్ భగత్ సింగ్ భవదీయుడు సినిమాలోనూ నటిస్తున్నాడు. అలాగే క్రిష్ డైరెక్టర్ గా హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=nxiULEXnjZ4&t=83s