పూనమ్‌ కౌర్‌ సంచలన ట్వీట్‌..#PKlove అంటూ హ్యాష్‌ ట్యాగ్‌..

0
90

నటి పూనమ్ కౌర్ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి నటి..‘మా’ ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి వచ్చింది. ఇక ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతు ఇస్తూ ఆమె ఇటీవల ఓ ట్వీట్‌ చేయగా అది చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా పూనమ్‌ చేసిన మరో ట్వీట్‌ సంచలనంగా మారింది.

తన ఫొటోలు కొన్ని షేర్‌ చేస్తూ దానికి ‘పీకేలవ్‌’ (#PKlove) అనే హ్యాష్‌ ట్యాగ్‌ జత చేసింది. దీంతో పూనమ్‌ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. పీకే అంటే పూనమ్‌ కౌర్‌ అనే అర్థం ఉన్నప్పటికీ ఇందులో మరిన్ని ఊహగానాలు రెకెత్తిస్తున్నట్లుగా ఉన్న ఆమె ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇంతకుముందు ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్ గెలవాలని కోరుకుంటున్నట్లు నటి పూనమ్‌ కౌర్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆయన గెలిచాక తాను ఎదుర్కొన్న  సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొంది. ఇంతకాలం నిశబ్థం ఉన్న నాకు ఆయన గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం వస్తుంది.

https://twitter.com/poonamkaurlal