Poonam Pandey | నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను: పూనమ్ పాండే

-

బాలీవుడ్ నటి పూనమ్ పాండే(Poonam Pandey) సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. చిన్న వయసులోనే ప్రాణాలు వదిలారని అయ్యో పాపం అన్నారు. అయితే కొంతమంది ఆమె మరణంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆమెకు మొదటి నుంచి పబ్లిసిటీ పిచ్చి. నటిగా కంటే ఎక్కువ వివాదాలతోనే పాపులారిటీ కోసం వెంపర్లాడతారు. దీంతో ఇది కూడా పబ్లిసిటీ కోసమే అని గట్టిగా నమ్మారు. పాండే నిజంగా చనిపోతే ఆమె డెడ్‌బాడీ ఎక్కడా ఎందుకు కనిపించలేదు.. కుటుంబసభ్యులు ఎందుకు స్పందించలేదనే సందేహాలు లేవనెత్తారు. తాజాగా వారు అనుకున్నదే నిజమైంది. తాను చనిపోలేదంటూ పూనమ్ పాండే స్వయంగా ఓ వీడియో విడుదల చేసింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

- Advertisement -

తాను బతికే ఉన్నానని… గర్భాశయ క్యాన్సర్‌ అవగాహన కోసమే ఇలా చేశానని చెప్పుకొచ్చారు. దీని వల్ల ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలిపారు. అయితే పాండే వీడియో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడానికి ఇది సరైన మార్గం కాదని.. బతికి ఉండి కూడా చనిపోయానని చెప్పడం ఏంటని మండిపడుతున్నారు. నీ పబ్లిసిటీ పిచ్చి పరాకష్టగా చేరిందని దుమ్మెత్తిపోస్తున్నారు. పూనమ్(Poonam Pandey) వ్యవహారశైలిపై బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అద్వానీకి భారతరత్న.. ఎమోషనల్ అయిన మోడీ
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...