టాలీవుడ్ ప్రముఖ నటి జయసుధ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్‌లో హీరోహీరోయిన్ల మధ్య వివక్ష ఉంటుందంటూ తెలుగు హీరోయిన్లను చిన్నచూపు చూస్తారని, అదే బాలీవుడ్ నుంచి ఏ హీరోహీరోయిన్ వచ్చిన వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారన్నారు. స్టార్ హీరోయిన్ అయిన తనకు కూడా ఇక్కడ అవమానాలు తప్పలేదన్నారు. ఆమె సినిమాలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ఈ విషయాలు చెప్పుకొచ్చారు.