ప్రముఖ గాయని సునీత వివాహంపై కొద్ది రోజులుగా అనేక వార్తలు వినిపించాయి, మొత్తానికి ఆమె వివాహానికి సంబంధించి తాజాగా క్లారిటీ అయితే వచ్చింది. డిజిటల్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న బిజినెస్ మెన్ రామ్ వీరపనేనితో సోమవారం ఉదయం సునీత నిశ్చితార్థం జరిగింది.
ఇంటి సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్ధం జరిగింది, ఆమెకి 19 ఏళ్ల వయసులోనే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్న సునీత పిల్లలతో కలిసి ఉంటున్నారు, సింగర్ గా ఆమె ఎంతో పాపులర్, ఇక ఆమె వివాహం గురించి అనేక వార్తలు వినిపించిన వేళ తాజాగా క్లారిటీ వచ్చింది.
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆమెకి విషెస్ తెలియచేస్తున్నారు, ఆమె అంటే చాలా మందికి ఎంతో ఇష్టం, ముఖ్యంగా ఆమె పాటలు వింటే ఎంతో ఆనందం కలుగుతుంది, మరి ఆమె వ్యక్తిగత జీవితం బాగోవాలి అని మనం కూడా కోరుకుందాం.