ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ(Posani Krishna Murali) కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవలే ఆయన పుణేలో ఓ షూటింగ్ లో పాల్గొని గురువారం హైదరాబాద్ వచ్చచారు. ఒంట్లో స్వల్ప అస్వస్థతగా ఉండడంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
కరోనా మహమ్మారి మొదలైన దగ్గరి నుంచి మూడోసారి ఆయనకు(Posani Krishna Murali) కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న సహ నటులు, వైసీపీ నేతలు, అభిమానులు పోసాని త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కాగా ఇటీవలే ఆయన నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చింది నంది అవార్డులు కాదని.. కమ్మ అవార్డులు అంటూ వ్యాఖ్యానించడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేపింది.
Read Also: కేసీఆర్ చేతుల మీదుగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ.. విశేషాలు ఇవే
Follow us on: Google News, Koo, Twitter