Devara | ‘దేవర’ అప్టేడ్ వచ్చేసిందిగా.. సీరియస్ లుక్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్..

-

RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) తదుపరి సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర(Devara)’ సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన ఒక్క పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ కొత్త పోసర్ట్‌ రిలీజ్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ సీరియర్ లుక్‌లో పడవలో ప్రయాణిస్తున్నట్లు చూపించారు. జనవరి 8న మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఎన్టీఆర్(NTR)- కొరటాల(Koratala Siva) కలయికలో వచ్చిన ‘జనతాగ్యారేజ్’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ఇద్దరి కాంబోలో ‘దేవర(Devara)’ రానుండడంతో మూవీపై మంచి హైప్ ఏర్పడింది. అంతేకాకుండా ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్(Saif Ali Khan) విలన్‌గా, తారక్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కల్యాణ్ రామ్(Kalyan Ram) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న మూవీ ఫస్ట్ పార్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే వార్-2 మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు. ఇందులో హృతిక్ రోషన్‌కు విలన్‌గా తారక్ నటించనుండడం విశేషం.

Read Also: ఈ చిన్నచిన్న ఆహారపు అలవాట్లతో గుండె ఆరోగ్యం పదిలం
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...