క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పై దర్శకుడు వెటకారపు ట్వీట్

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పై దర్శకుడు వెటకారపు ట్వీట్

0
100

క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అనే కార్య‌క్ర‌మం 1980 నాటి అగ్రతార‌లు అంద‌రూ చేసుకుంటారు అనేది తెలిసిందే. ఈ ఏడాది ఈ వేడుక మెగాస్టార్ చిరంజీవి ఇంట జరిగింది.టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్ నుంచి నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, భాగ్యరాజ్, రమేష్ అరవింద్, ఖుష్బూ, జయరాజ్, లిజీ, సుమన్, భానుచందర్, రాధికా, జయప్రద, జయసుధ, రేవతి, సుహాసిని, అమల, రాధా తదితరులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

అందరూ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు అయితే 40మంది వరకూ హజరైన ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ దూరంగా ఉన్నారు. ఆయనతో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అర్జున్, మమ్ముట్టి, రమ్యకృష్ణ. సత్యరాజ్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, రాజశేఖర్ దంపతులతో పాటు పలువురు స్టార్ నటీనటులు కూడా హాజరుకాలేదు.

రజనీకాంత్ బాలయ్య సినిమా షూటింగ్ వల్ల హజరుకాలేదు అని తెలుస్తోంది. ఇక సత్యారాజ్ అర్జున్ కూడా వేరే చోట షూటింగ్ లో బిజీగా ఉండి రాలేదు అని తెలుస్తోంది..తాజాగా ఈ పార్టీపై మరో దర్శకుడు కామెంట్ చేశాడు .. కోలీవుడ్ నటుడు, దర్శకుడు ప్రతాప్ పొతిన్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశాడు. 80లలో ఉన్న నటీనటుల్లో నేను అంత మంచి నటుడిని, దర్శకుడిని కాకపోయి ఉండొచ్చు. అందుకే నన్ను వాళ్లు గెట్ టు గెదర్‌కు పిలవలేదేమో అంటూ ఆయన ట్వీట్ చేశాడు. మరి ఇదికేవలం నటులకే అని దర్శకులకి కాదు అని అంటున్నారు నెటిజన్లు.