ఆ దర్శకుడితో పవర్ స్టార్ మూవీ..కారణం ఇదేనా?

0
99

పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూ జోరు పెంచారు. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ చేస్తున్న పవన్..దీని తర్వాత ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేస్తారు. అనంతరం హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డితో  చిత్రాలు చేయాల్సి వుంది. ఇదిలా ఉండగా ఆయన దేవ కట్టా దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్.

తాజాగా సాయితేజ్ హీరోగా దేవ కట్టా రూపొందించిన ‘రిపబ్లిక్’ సినిమా హిట్టయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పవన్ కల్యాణ్ ను రిపబ్లిక్ బాగా ఆకట్టుకున్నట్టు, దాంతో ఆయన దేవ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

ఓ మంచి కథను రెడీ చేయమని పవన్ ఆయనకు చెప్పినట్టు, దీనికి దేవ కట్టా ఆనందంతో అంగీకరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పనిలోనే దర్శకుడు దేవ నిమగ్నమైనట్టు సమాచారం. అయితే, కథ రెడీ అయినప్పటికీ ప్రస్తుతం పవన్ కమిట్ మెంట్స్ పూర్తయి, ఇది సెట్స్ కు వెళ్లడానికి కాస్త సమయం పట్టచ్చు.