పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు, అయితే ఇప్పటికే ఆయన వరుసగా నాలుగు సినిమాలు చేస్తున్నారు అనేది తెలుస్తోంది, ఇప్పుడు తాజాగా ఆయన సినిమాలో నటీ నటుల ఎంపికలో దర్శకులు బిజీ అయ్యారు, అయితే ఆయన వకీల్ సాబ్ తర్వాత క్రిష్ చిత్రం పూర్తి చేస్తారు.
ఆ తర్వాత ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా తెలియడం లేదు, అయితే తాజాగా ఆయన సినిమాలో సాయిపల్లవి ఓ హీరోయిన్ గా ఫిక్స్ అయింది అని వార్తలు వినిపించాయి, తాజాగా ఓ సినిమాలో రానా కూడా ఓ రోల్ చేస్తున్నారు అని వార్తలు వచ్చాయి.
తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు.మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్కు రీమేక్ గా ఇది రానుంది అని తెలుస్తోంది, అయితే ఇందులో నితిన్ పేరు వినిపిస్తూనే ఉంది.
తాజాగా కన్నడ స్టార్ హీరో, ఈగ విలన్ సుదీప్ పేరు వినబడుతోంది. ఇక ఇటీవల పవన్ ని ఆయన కూడాకలిశారు, అయితే ఈ భేటీలో సినిమా స్టోరీ కూడా చర్చించారు అని వార్తలు వస్తున్నాయి,
సో ఇక ఆయన పేరు తాజాగా తెరపైకి రావడంతో ఇప్పుడు అందరూ సూపర్ కాంబో అంటున్నారు,
అయితే దీనిపై ఇంకా చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.