పవర్ స్టార్ పునీత్ మృతి తట్టుకోలేక 10 మంది ఫ్యాన్స్ మృతి

Power star Puneet's death left 10 fans dead

0
104

కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్ హఠాన్మరణం చాలామందిని షాక్​కు గురి చేసింది. పునీత్​ మరణాన్ని తట్టుకోలేక ఫ్యాన్స్​ తుదిశ్వాస విడుస్తున్నారు. కొందరు ఉరి వేసుకుని, మరికొందరు గుండెపోటుతో మరణించారు. మరో అభిమాని ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడు. పునీత్ మృతిని తట్టుకోలేక కర్ణాటకకు చెందిన ఆరుగురు ఫ్యాన్స్​ మరణించగా, మరో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. మరో అభిమానికి గుండెపోటు రావడం వల్ల అతడిని ఆస్పత్రిలో చేర్చారు.

కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అంత్యక్రియలు అధికార లాంఛనాల నడుమ ఆదివారం ఉదయం జరిగాయి. కంఠీరవ స్టూడియోలోని పునీత్‌ తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పునీత్‌ అంత్యక్రియలకు కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, యడియూరప్ప, సిద్ధరామయ్య, నటులు యశ్, సుదీప్‌, తదితరులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.

పునీత్‌ రెండో సోదరుడు రాఘవేంద్ర కుమారుడు వినయ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు తెల్లవారు జామున 5 గంటల సమయంలో అంతిమయాత్ర జరిగింది. కంఠీరవ స్టేడియం నుంచి కంఠీరవ స్టూడియో వరకూ భారీ కాన్వాయ్‌ మధ్య పునీత్‌ అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.